కోట్ల ఆస్తులున్న పేదవాడు


ఓ ధనికుడైన తండ్రి తన కుమారుడుకి పేదవారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో చూపించడం కోసం ఒక గ్రామానికి తీసుకు వెళ్ళాడు. ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంతో కొంత సమయం గడిపారు. తిరుగు ప్రయాణంలో తండ్రి తన కొడుకుని ఇలా అడిగాడు "చూసావు కదా! పేదవారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో| దీనిబట్టి నువ్వు ఏం నేర్చుకున్నావ్?" దానికి సమాధానంగా కొడుకు ఇలా అన్నాడు. "మనకి ఒక కుక్క మాత్రమే ఉంది. వారికి నాలుగు కుక్కలు ఉన్నాయి. మనకి ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది, వారికి నది వుంది. మనకు చీకటి పడితే ట్యూబ్ లైట్లు ఉన్నాయి, వారికి నక్షత్రాలే ఉన్నాయి. మనం ఆహారాన్ని కొంటున్నాము, కాని వాళ్లు వారికి కావలసిన ఆహారాన్ని వాళ్లే పండించుకుంటున్నారు. మనకు రక్షణగా గోడలు ఉన్నాయి, వారికి రక్షణగా స్నేహితులు ఉన్నారు. మనకు టీవీ, సెల్ ఫోన్స్ ఉన్నాయి, కానీ వాళ్లు వారి కుటుంబంతో, బంధువులతో ఆనందంగా గడుపుతున్నారు. మనము ఎంత పేదవాళ్ళమో నాకు చూపించినందుకు చాలా థాంక్స్ డాడీ."

Comments

Popular Posts