Bagundalamma Lyrics in Telugu



మందు లేని గాయమే చేసి పోయినావే

మంట ఓర్చుకోనిదే నా కంటనీరు ఆగదే

తప్పేలే తప్పేలే

ఈరోజుల్లో ప్రాణంగా ప్రేమించా

తప్పంతా నాదేలే

తప్పేలే తప్పేలే

నా జన్మంతా నీ చెంత అనుకున్నా

తప్పంతా నాధేలే

అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే

అందరిలాగే నువ్వు నన్ను ఒదించావే

అందరిలాగే నేను నిన్ను కోరుకొనే

బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా

ఈ బాధే చాలమ్మ బ్రతికేస్తా ఈ జన్మ బాగుందాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా ఈ బాధే చాలమ్మ బ్రతికేస్తా ఈ జన్మ

అనుకున్న నేను నీ మెడలో మెరిసే తాళని

అనుకోలేదే నీ పెళ్లిలో అతిథి నేనని

రాసుకున్న నా నెత్తుటితో ప్రేమలేఖ

నాకు ఇచ్చావే రమ్మని నీ పెళ్లి పత్రికా నీ చుట్టుముట్టున అతిధులు

అందులోనే నీ నవ్వులు

నీ పక్కనున్నోడి మునివేలు

చూడలేక నేను చచ్చిబతికాను

నీకు వేస్తు ఉంటే మూడు ముల్లు 

కన్నీటి అక్షింతలేసావే బాగుండాలమ్మా

నువ్వు ఎవరితో ఉన్నా ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ 

బాగుందాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా 

ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా

 ఈ జన్మను చూస్తున్నానే వులు అల్లిన కారులోనా ఊరేగుతున్నానే చిన్నదానా

అనుకున్నానే నా నుదుటి రాత నువ్వని

చూస్తున్నానే బ్రతుకంటే ఇంతేనేమని

ఊపిరి ఆగేటి బాధలోనా

చిందులేస్తున్నానే పిచ్చివాన్నా

తట్టుకోలేని బాధే నాకున్నా

సంతోషంగా నిన్ను సాగనంపుతున్నా

బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా

ఈ బాధే చాలమ్మ బ్రతికేస్తా

 ఈ జన్మ బాగుందాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా

 ఈ బాధే చాలమ్మ బ్రతికేస్తా ఈ జన్మ.!

Comments

Popular Posts