Alanati Raamachandrudu Lyric in Telugu
చిత్రం: మురారి (2001)
తారాగణం : మహేష్ బాబు, సోనాలి బింద్రే
సంగీతం: మణిశర్మ
దర్శకుడు: కృష్ణ వంశీ
నిర్మాతలు: ఎన్ దేవి ప్రసాద్, రామలింగేశ్వరరావుఅలనాటి రామచంద్రుడు పాట సాహిత్యం
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాతీ
ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిటా మేటి
అనిపించే అరుదైనా అబ్బాయికి మనువండీ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీ హరి ఇంటి దీపమల్లె కనిపించిన జానా
అటువంటి అపరంజి అమ్మాయిని కానరండి
చందమామ చందమామ కిందకి చూడమ్మా
ఈ నేల మీద నేలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మ వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వేల వేళ బోవమ్మా
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేలు
పచ్చని మేడపై వెచ్చగా రాసేను చిలిపి రహస్యాలు
నెలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగా తడిపెను తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయానా
ఆఆఆఆఆ.......
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయానా
కల కల జంటను పదిమంది చూడండీ
తల తల మెరిసినా ఆనందపు తడి చూపుల అక్షింతలెయ్యండి
చందమామ చందమామ కిందకి చూడమ్మా
ఈ నేల మీద నేలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మ వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వేల వేళ బోవమ్మా
సీతారాముల కల్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని వీళ్లు ఈ పెళ్లి మండపాన
గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగలేదు మన్మధుని వొళ్లు ఈ చల్లని సమయం
దేవుళ్ల పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగినా
ఆఆఆఆఆ.......
దేవుళ్ల పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగినా
అనుకోని కానివినీ ఎరుగని పెళ్లికి జనమంతా రారండి
తడుపరి వివరణలదగక బంధువులంతా కదలండి
చందమామ చందమామ కిందకి చూడమ్మా
ఈ నేల మీద నేలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మ వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగ్గా లేవని వేల వేళ బోవమ్మా


Comments
Post a Comment